కొండమంజులూరు టొర్నమెంట్ ఫైనల్ లో అరుణా ఇన్ఫ్రా టీం ఘన విజయం

Sunday, January 16, 2022 07:03 PM News
కొండమంజులూరు  టొర్నమెంట్ ఫైనల్  లో అరుణా ఇన్ఫ్రా టీం ఘన విజయం

కొండమంజులూరు క్రికెట్ టొర్నమెంట్ ఫైనల్ లో అరుణా ఇన్ఫ్రా టీం ఘన విజయం సాధించింది. ఈ రోజు కొండమంజులురు క్రికెట్ క్లబ్ టొర్నమెంట్ ఫైనల్లో ఒంగోలుకి చెందిన అరుణ ఇన్ఫ్రా జట్టు,  చెన్నై కి చెందిన MRCC క్రికెట్ క్లబ్ తలపడ్డాయి. ఇరు జట్లలో ఆంద్రా హైదరాబాద్ తమిళనాడులకు చెందిన దాదాపు 20 మంది రంజీ ప్లేయర్లు ఉండడంతో ఫలితం ఉత్కంఠగా మారింది.

మొదట బాటింగ్ చేసిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 132 పరుగులు చేసింది. 133 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన అరుణా ఇన్ఫ్రా జట్టు మొదటిలో కొంచం తడపడినా మిడిల్ ఆర్డర్ బాగా ఆడటం వలన అరుణా ఇన్ఫ్రా టీం ఘన  విజయం సాధించింది. అరుణ ఇన్ఫ్రా టీం గురించి చెప్పాలంటే మాజీ రంజీ క్రికెటర్ ఒంగోలు క్రికెట్ సర్కిల్ కు గురువు లాంటి వారైన శ్రీను గారి ఆధ్వర్యంలో గత ఐదారేళ్ళుగా పాల్గొన్న అన్ని టొర్నమెంట్స్ లో బాగా ఆడుతున్నారు. ఈ టీం ఓనర్ మారెడ్డి వెంకటాద్రి రెడ్డి మొదటినుండి క్రికెట్ అంటే మంచి ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఎప్పుడు టీంలో యువ క్రికెటర్లతో సహ ఐదారుగురు రంజీ క్రికెటర్లు ఆడుతుంటారు.

కొండెపి మండలం గుర్రపడియ గ్రామంలోని రైతు కుటుంబం నుండి వచ్చిన మారెడ్డి కోటిరెడ్డి గారికి రాజకీయం గా మంచిపేరు ఉంది. అతని ముగ్గురి కుమారుల్లో పెద్దాయన మరెడ్డి శేషా రెడ్డి హైదారాబాద్ లో ప్రముఖ కంపెనీలో జాబ్ కాగా. రెండవ సోదరుడు మారెడ్డి రామకృష్ణా రెడ్డి ప్రముఖ న్యూరాలజిష్ట్ గా గుంటూరులో ఉదయ హాస్పిటల్ ను స్థాపించి వైద్య రంగంలో బాగా రాణిస్తున్నారు. ఇక మూడవ వాడైన మరెడ్డి వెంకటాద్రి రెడ్డి కొన్నాళ్ళ పాటు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసి వచ్చి ఇప్పుడు నిర్మాణ రంగంలో అరుణా ఇన్ఫ్రా ని స్థాపించి రాణిస్తున్నారు. వీరి వైఫ్ అరుణ గారు ప్రస్తుతం కొండెపి మండల జెడ్పీటీసీ గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: