ఏపీలో ఒంటి పూట బడులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Saturday, March 1, 2025 12:10 PM News

ఏపీలో ఒంటి పూట బడుల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేసవి కాలం ఒంటి పూట బడులపై వినతులు వస్తున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మార్చి 15వ తేదీ నుండి ఒంటి పూట బడులను ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సుమారు 37 డిగ్రీలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల స్థాయి విద్యార్థులకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: