తల్లికి వందనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో, 28న బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో పలు పథకాల అమలు కోసం నిధుల కేటాయింపులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2024లో ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నెల 24న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజున గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 28న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్‌లో సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తల్లికి వందనం పథకం పథకం కింద ప్రతి తల్లికి రూ.15,000 చొప్పున ప్రభుత్వం నేరుగా ఖాతాలో జమ చేయనుంది.తాజా లెక్కల ప్రకారం 69.16 లక్షల మంది అర్హులుగా గుర్తింపు పొందారు. దీనికి కావాల్సిన మొత్తం రూ. 10,300 కోట్లు అవసరమని తేల్చారు. అర్హతల ఖరారు ఇంకా కొనసాగుతోంది.