ఏపీలో ఉగాది నుండి కొత్త పథకం అమలు
_(4)-1742203651.jpeg)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది నుంచి పి4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీని ద్వారా ఏపీ అభివృద్ధిలో ప్రజలు నేరుగా భాగస్వాములు అవుతారని,తద్వారా అభివృద్ధి ఫలాలను ప్రజలు అందుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సంపదను పెంచుతామనీ, పేదరికాన్ని నిర్మూలిస్తామని తెలిపారు.
పీ4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్‌నర్‌షిప్ అని అర్థం. ఇది వరకు పీ3 ఉండేది. అందులో భాగంగా ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు చేపడితే అందులో ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడి పెట్టి వచ్చే లాభాలను పంచుకునేవి. ఇప్పుడు పీ4లో ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలతోపాటూ ప్రజలు కూడా పెట్టుబడులు పెట్టే వీలు కలుగుతుంది. తద్వారా వచ్చే లాభాల్లో వారికీ వాటా ఉంటుంది.
పీ4 ద్వారా ఏపీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధితోపాటు ఏపీ వ్యాప్తంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు పెట్టుబడి పెట్టే అవకాశాలు కల్పిస్తుంది. ప్రజలు ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వడానికి వీలవుతుంది. స్వయంగా ప్రజలు కూడా ప్రాజెక్టుల్లో భాగస్వాములు అవుతారు. అవి సక్రమంగా జరిగేలా ప్రజలు చూసుకుంటారు. తద్వారా అందరి బాధ్యతతో ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే వీలు కలుగుతుంది. ఏపీ అభివృద్ధి చెందితే. ఆ ఫలాలు పీ4లో భాగమైన వారికి కూడా దక్కుతాయి.