ఏపీ: నేడు పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్
Friday, February 28, 2025 08:00 AM News
ఏపీలోని కూటమి ప్రభుత్వం నేడు అసెంబ్లీలో, శాసన మండలిలో తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మరో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో హామీ ఇచ్చిన పథకాలకు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు తొలిసారి బడ్జెట్ పుస్తకాల ముద్రణను ప్రభుత్వం ఆపేసింది. బడ్జెట్ వివరాలు ఉండే పెన్ డ్రైవ్ ను సభ్యులతో పాటు మీడియా ప్రతినిధులకు అందించనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
