పింఛన్ దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
Monday, March 17, 2025 10:00 AM News
_(20)-1742147346.jpeg)
పింఛన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొందరు వృద్ధులకు వేలిముద్రలు అరిగిపోయి పెన్షన్ల పంపిణీ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు 1,34,450 అత్యాధునిక స్కానర్లను పంపిణీ చేయనుంది. ఇందులో ఉడాయ్(UIDAI) ఆధార్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు. ఈ పరికరాల సాయంతో వేలిముద్రల సమస్యకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: