రేపు కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు
Monday, July 28, 2025 10:10 PM News
ఏపిలో కానిస్టేబుల్ నియామకం కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. హోంమంత్రి అనిత ఫలితాలను విడుదల చేయనున్నారు.
కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను తాత్కాలికంగా ఆపివేయాలని గతంలో హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఉత్తర్వుల నేపథ్యంలో నిలిపివేశారు. ఇప్పటికే శారీరక సామర్థ్యం, రాత పరీక్షల్లో అర్హత సాధించడం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పూర్వాపరాల పరిశీలనతో పాటు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. 2022 అక్టోబర్లో కానిస్టేబుల్ పరీక్షలు జరిగాయి. తాజాగా న్యాయ వివాదాలు అన్నీ క్లియర్ కావడంతో రేపు ఫలితాలు విడుదల చేయబోతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



