ప్రణయ్ హత్య కేసు తీర్పు: స్పందించిన అమృత
Wednesday, March 12, 2025 07:37 AM News
_(13)-1741745207.jpeg)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పుపై మృతిని భార్య అమృత ప్రణయ్ స్పందించారు. నిందితులకు కోర్టు శిక్ష విధించడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పోలీసు శాఖ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియాకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం లభించిందని, ఈ తీర్పుతోనైనా పరువు పేరుతో జరిగే నేరాలు, దౌర్జన్యాలు తగ్గుతాయని ఆశిస్తున్నానని అన్నారు. తన బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రెస్మీట్ నిర్వహించడం లేదని పోస్ట్ చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: