షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో , కారు ఢీకొడితే ఎగిరి అవతలపడి..

Monday, March 3, 2025 01:29 PM News
షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో , కారు ఢీకొడితే ఎగిరి అవతలపడి..

యూపీలోని రాయ్‌బరేలిలోని ఉంచహార్ కొత్వాలి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కారు రోడ్డు మీద వెళుతున్న బైక్ రైడర్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేసి నిందితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వీడియోను బట్టి చూస్తే కారు డ్రైవర్ కావాలని ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బైకు మీద ఉన్న ఇద్దరు రైడర్లు ఎగిరి అవతలపడ్డారు. 


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: