ఏపీ: ఒకే గ్రామంలో 200 మందికి క్యాన్సర్..
Saturday, March 22, 2025 09:46 PM News
_(2)-1742660169.jpeg)
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో దాదాపు 200 మంది క్యాన్సర్ బారిన పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి కూడా అసెంబ్లీలో లేవనెత్తారు. దీంతో ఈ రోజు వైద్య సిబ్బంది గ్రామంలో పరీక్షలు నిర్వహించారు.
ఇప్పటికే 23 మంది క్యాన్సర్ బాధితులున్నట్లు కలెక్టర్ ప్రశాంతి వెల్లడించారు. ఈ ప్రాంతంలో నీరు, గాలి కాలుష్యం కావడంతో గ్రామస్థులకు ఈ పరిస్థితి వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: