ఆరు చోట్ల తొక్కిసలాట.. 175 మంది మృత్యువాత
Wednesday, June 4, 2025 10:41 PM News
చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో 11మంది మృతి చెందడం తెలిసిందే. గతేడాది నుంచి దేశంలో ఆరు చోట్ల తొక్కిసలాట జరిగింది. మొత్తం 175 మంది మృత్యువాత పడ్డారు. 2024 జులైలో ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో భోలే బాబా సత్సంగ్ లో 121 మంది మరణించారు.
2024 డిసెంబర్ లో పుష్ప-2 రిలీజ్ వేళ సంధ్య థియేటర్ వద్ద ఓ మహిళ చనిపోయింది. 2025 జనవరిలో తిరుపతిలో టోకెన్ల జారీ నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు. మహా కుంభమేళాలో 30 మంది మరణించారు. 2025 మేలో గోవాలోని ఆలయం వద్ద ఆరుగురు చనిపోయారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)