కొలెస్ట్రాల్ పెరిగితే కనిపించే లక్షణాలు ఇవే..
_(12)-1741485549.jpeg)
మారుతున్న జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. దేశంలో అధిక కొలెస్ట్రాల్ ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారింది. అధిక కొలెస్ట్రాల్‌ని డైస్లిపిడెమియా అని కూడా అంటారు. కొలెస్ట్రాల్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్), HDL (హై డెన్సిటీ లిపోప్రొటీన్). అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ మనకు చాలా మంచిది. దీనిని మంచి కొలెస్ట్రాల్ అంటారు. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) మన ఆరోగ్యానికి మంచిది కాదు. దీనిని చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇది రక్త ధమనుల్లో పేరుకుపోతుంది. అంతేకాకుండా రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ధమనుల్లో పేరుకుపోయే కొవ్వును ప్లేక్ అంటారు. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ఈ రోజుల్లో అధిక కొలెస్ట్రాల్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందుకే పెరిగిన కొలెస్ట్రాల్‌ని తగిన సమయంలో గుర్తించాలి. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఉదయం పూట కొన్ని లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు కాళ్ళలో నొప్పి, తిమ్మిరి అనిపించవచ్చు. వాస్తవానికి, కొలెస్ట్రాల్ పెరుగుదల కారణంగా, రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఇది కాళ్ళలో నొప్పి, తిమ్మిరిని కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల సిరలు, ధమనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. అందుకే రక్త ప్రసరణ జరగదు. కాళ్ళలో నొప్పి, తిమ్మిరి వస్తుంది. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుణ్ని సంప్రదించండి.
గమనిక: సంబంధిత నిపుణుల సూచనలతో ఈ వివరాలు అందించాం. వ్యక్తులను బట్టి లక్షణాలు ఉంటాయి. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.