మొలకెత్తిన పెసర ఎప్పుడు, ఎలా తినాలో తెలుసా..?

Wednesday, April 2, 2025 07:21 AM Lifestyle
మొలకెత్తిన పెసర ఎప్పుడు, ఎలా తినాలో తెలుసా..?

చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే మరికొందరు జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేకపోతున్నారు. మొలకెత్తిన పెసలు బరువును తగ్గించడానికి సహాయపడతాయి. అయితే వాటిని సరైన సమయంలో సరైన విధంగా తీసుకోవాలి...

ఉదయం ఖాళీ కడుపుతో మొలకెత్తిన పెసర పప్పు తినడం మంచిది. దీంతో రోజు ప్రారంభంలో శరీరానికి తగిన పోషకాలు అందుతాయి. శరీరం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. మొలకెత్తిన పెసర పప్పులో అధిక ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు సాయపడుతుంది. మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు.

ఎలా తినాలి..?

ముందుగా పెసర పప్పును బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఒక పాత్రలో గుప్పెడు పెసర పప్పు తీసుకుని 6-8 గంటలు నీటిలో నానబెట్టండి. తర్వాత దానిని వడకట్టి వాటి నుంచి పూర్తిగా నీటిని తొలగించాలి. ఇప్పుడు పెసరపప్పును వేరు చేసి ఒక పాత్రలో ఉంచండి. ఆ తర్వాత పెసర పప్పును శుభ్రమైన కాటన్ గుడ్డలో ఉంచి దానిని కప్పండి. ఆ తర్వాత జల్లెడలో కప్పి 12-14 గంటలు అలాగే ఉంచండి. ఈ సమయంలో పెసర పప్పు మొలకెత్తే ప్రక్రియ ప్రారంభమవుతుంది. పెసర పప్పులో చిన్న మొలకలు కనిపిస్తే అవి తినడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం. మొలకెత్తిన పెసర పప్పును మీరు అలాగే తినవచ్చు. లేదా వాటికి నిమ్మరసం, నల్ల ఉప్పు, కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసి సలాడ్‌లా కూడా తినవచ్చు.

లాభాలు: మొలకెత్తిన పెసర పప్పులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో మొలకెత్తిన పెసర పప్పు తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి సాయపడుతుంది. మొలకెత్తిన పెసర పప్పు జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్‌లతో నిండి ఉంటుంది. ఇది మలబద్దకం, అజీర్ణం, కడుపు సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మొలకెత్తిన పెసర పప్పులో ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల్ని బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. మొలకెత్తిన పెసర ప్పు తినడం వల్ల శరీరం నుంచి టాక్సిన్లు బయటకు పోతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని శుభ్రపరుస్తుంది.

మహిళలకు: మొలకెత్తిన పెసర పప్పు మహిళలకు చాలా ప్రయోజనకరం చేకూరుస్తుంది. హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి ఉపయోగపడుతుంది. రుతుక్రమ సమస్యల్ని తగ్గిస్తుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: