కిడ్నీలను కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
_(21)-1742176522.jpeg)
రకరకాల మూత్రపిండాల సమస్యలు ప్రస్తుతం ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, డెంగ్యూ, మలేరియా, హెచ్ఐవి పాజిటివ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వంటి వాటి కోసం వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. కిడ్నీలను కాపాడుకోవడానికి జాగ్రతలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకోవాలి. మాంసాహారాన్ని అధికంగా తీసుకోకూడదు. ప్రతి రోజు కనీసం ఒక 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాలి. తినే ఆహారంలో కచ్చితంగా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే మానుకోవాలి. నొప్పులకు సంబంధించి చీటికిమాటికి టాబ్లెట్లు, అనవసరమైన స్టెరాయిడ్లు వాడకుండా జాగ్రత్త పడాలి.
మధుమేహం, హైబీపీతో బాధపడుతున్న వారు తరచూ పరీక్షలు చేసుకుంటూ వైద్యుల సలహాల మేరకు మందులు వాడాలి. రక్తహీనతతో బాధపడుతున్న వారు నీరసం, ఒళ్ళు నొప్పులు, ఆయాసం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు వైద్యుల సలహా మేరకు మూత్రపిండాల పనితీరును చెక్ చేయించుకుని అవసరమైతేనే మందులు వాడాలి. మూత్రపిండాల సమస్యల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. కిడ్నీ సమస్యలను గుర్తించడం ఆలస్యం చేస్తే చికిత్సకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే మూత్రపిండాలను కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి.