కొలెస్ట్రాల్ ను కరిగించే అలవాట్లు.. ఇవి పాటిస్తే సూపర్ ఫిట్..

Friday, March 21, 2025 07:33 AM Lifestyle
కొలెస్ట్రాల్ ను కరిగించే అలవాట్లు.. ఇవి పాటిస్తే సూపర్ ఫిట్..

శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్, రెండోది చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ నిజంగానే శరీరానికి మంచి చేస్తే చెడు కొలెస్ట్రాల్ మాత్రం గుండెపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో సరిగాలేని లైఫ్‌స్టైల్, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, వర్కౌట్ చేయకపోవడం వంటి కారణాలతోనే బాడీలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది.

శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంటే రెడ్‌మీట్, ఫుల్ ఫ్యాట్ డెయిరీ ప్రోడక్ట్స్ తీసుకుంటే బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరడానికి కారణమవుతుంది. వీటిని తగ్గించుకోవాలి. 

ట్రాన్స్ ఫ్యాట్స్ తినడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంది. ఇవి హైడ్రోజెనేటెడ్ వెజిటేబుల్ ఆయిల్ రూపంలో ఉంటాయి. ఈ ఆయిల్‌ని చాలా వరకూ బయట దొరికే కుకీస్, కేక్స్‌లో వాడతారు. దీని వల్లే మన బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే, బయట దొరికే జంక్ ఫుడ్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. 

వే ప్రోటీన్ తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇవి డెయిరీ ప్రోడక్ట్స్‌లో మనకి లభిస్తుంది. ఈ వే ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌తో పాటు మొత్తం కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్‌ కూడా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

సొల్యూబుల్ ఫైబర్ తీసుకోవడం వల్ల రక్తప్రవాహంలో కొలెస్ట్రాల పెరగకుండా ఉంటుంది. ఈ సొల్యూబుల్ ఫైబర్ అనేది మనకి ఓట్స్, కిడ్నీ బీన్స్, మొలకలు, ఆపిల్స్, పియర్స్ వంటి వాటిలో దొరుకుతుంది. వీటిని తీసుకోవడం వల్ల గుండెకి చాలా మంచిది.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మంచిది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా హెల్ప్ చేస్తాయి. బ్లడ్ ప్రెజర్‌ను కూడా తగ్గిస్తాయి. ఈ ఒమేగా 3 అనేది సాల్మన్, మాకెరెల్, హెర్రింగ్ వంటి చేపలతో పాటు వాల్‌నట్స్, ఫ్లాక్స్‌సీడ్స్‌లో కూడా ఉంటాయి.

కొలెస్ట్రాల్ తగ్గేందుకు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తిన్న తర్వాత 15 నిమిషాల పాటు నడవాలి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది. వీలైతే రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయాలి. దీని వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వారానికి 1 నుంచి 2 సార్లు ఉపవాసం ఉండాలి. సుమారు 12 నుంచి 14 గంటల పాటు ఉపవాసం ఉంటే కొవ్వు పెరగకుండా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగ్గా మారతాయి. వీటితో పాటు ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ వంటి వాటిని తగ్గించాలి.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: