మీరు నెయ్యి తింటున్నారా.. అయితే ఇది కచ్చితంగా తెలుసుకోండి..

Saturday, March 15, 2025 07:22 AM Lifestyle
మీరు నెయ్యి తింటున్నారా.. అయితే ఇది  కచ్చితంగా తెలుసుకోండి..

నెయ్యి చాలా ఆరోగ్యకరమైన, పోషకవంతమైన శాతం. నెయ్యి మన శరీరానికి అవసరమైన కొవ్వులను అందించి శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. అయితే నెయ్యిని కొన్ని ఆహారాలతో కలిపి తింటే అది జీర్ణక్రియకు విఘాతం కలిగిస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నెయ్యిని కొన్ని ఆహారాలతో జతగా తీసుకుంటే అది శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది..

తేనెను నెయ్యితో కలిపి తింటే అది చాలా ప్రమాదకరం. వాటిని కలిపి తింటే శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. దీని వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శరీరంలో వేడి పెరగడం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. నెయ్యి, చేపల కలయిక శరీరంలో జీవక్రియను అసమతుల్యంగా చేస్తుంది. దీని వల్ల శరీరంలో అలసట, చర్మ సమస్యలు కూడా రావొచ్చు. నెయ్యి, పెరుగు కలిపి తింటే శరీరంలో అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ రెండు పరస్పర విరుద్ధమైన లక్షణాల కలయిక వల్ల జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. దీని కారణంగా ఎసిడిటీ, అలసట, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. పండ్లను నెయ్యితో కలిపి తినడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. పండ్లలోని పోషకాలు, నెయ్యిలోని కొవ్వు కలిసినప్పుడు శరీరం వాటిని సరిగా జీర్ణం చేయలేకపోతుంది. ఇది గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుంది.

వేడి నీటితో నెయ్యిని కలిపి తీసుకోవడం ఆరోగ్యకరం కాదు. వేడి నీటితో నెయ్యిని కలిపినప్పుడు నెయ్యిలోని ఆరోగ్యకరమైన లక్షణాలు నాశనం అవుతాయి. ఇది శరీరానికి అసమర్థంగా ఉండటమే కాకుండా జీర్ణం కావడంలో ఇబ్బందులు వస్తాయి. టీ, కాఫీ రోజువారీ జీవితంలో చాలా మందికి ప్రియమైనవి. వీటికి నెయ్యిని జత చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. నెయ్యి టీ లేదా కాఫీలో కలపడం వల్ల డ్రింక్ ల నుండి శరీరానికి వచ్చే పోషకాలు సరిగా అందవు. ఇది ఎసిడిటీ, జీర్ణక్రియలో సమస్యలకు దారితీస్తుంది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: