రొమాన్స్ - సెక్స్ కు మధ్య తేడా ఏంటి? మీ పార్టనర్ హ్యాపీగా ఉండాలంటే ఇలానే చేయాలి

రొమాన్స్ అంటే ఏంటి అంటే, సెక్స్ ముందు చేసేది అనే ఆలోచనా ఉంది చాలా మందికి.
రొమాన్స్ కి సెక్స్ కి సంబంధం లేదు.
సెక్స్ అనేది శారీరక అవసరం.
రొమాన్స్ అనేది మానసిక అవసరం.
శరీరం కొన్నిసార్లు బలంగా కోరుకుంటుంది, హార్మోన్స్ ఆ టైంలో సెక్స్ కావాలి.
కానీ రొమాన్స్ అనేది 99% మంది ఆడవాళ్ళకే దీని అర్థం తెలియదు.
మగవారికి అయితే దీని అవసరం లేదు అనే ఫీలింగ్ లో ఉంటారు.
రొమాన్స్ అనేది మానసిక, మనసు యొక్క అవసరం.
రొమాన్స్ అనేది ఫీల్ గుడ్ మూమెంట్లను ఇచ్చేది. ఫీలింగ్ తెప్పించేది.
అలసిన అప్పుడు ఒక మంచి కాఫీ తాగావనుకో, ఎలా ఉంటుంది, మంచి ఫీల్ అనిపిస్తుంది.
వర్షం పడేటప్పుడు బజ్జీలు తినాలి అని ఫీలింగ్ అనేది .
ఒక మంచి పుస్తకం చదివిన అప్పుడు మనసుకు,
నచ్చిన ప్లేసు ఆస్వాదించేటప్పుడు,
చలికాలంలో నిద్రమత్తులో ఉదయాన్నే లేవకుండా, అలాగే ముసుగుతన్ని పండుకుని బెడ్ షీట్ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది.
ఇలా మనసు యొక్క కొన్ని అవసరాలు ,ఫీలింగ్స్ ఉంటాయి.
ఈ రొమాన్స్ కూడా అలాగే ఉంటుంది.
మాటలు తో,
సరసాలతో,
అలకలు ,బుజ్జి గింపులతో,
హత్తుకోవడం,
కొరకడం,
స్పర్శించడం,
చూపులతో,
పెదాలతో,
చేతులతో,
వెచ్చని కౌగిలిలో,
మత్తెక్కించే గుసగుసలా మాటలు,
వెచ్చని శరీరానికి చల్లదనపు స్పర్శ.
ఇలా ప్రతి రొమాంటిక్ మూమెంట్ని, శరీరం ఒక ఫీల్ గుడ్ లాగా మనసుకు ఇస్తుంది అన్నమాట.
కొన్ని సినిమాలు చూసినప్పుడు, మంచి ఫీల్ గుడ్ మూవీ అంటాం కదా, అలాంటిది అన్నమాట.
ఈ రొమాన్స్ అనేది, ఆ అందం మీద ఇష్టం ఉండాలి.
ఆరాధన భావన ఉండాలి.
పిచ్చి వ్యామోహం ఉండాలి.
అతి ప్రేమ ఉండాలి.
99 శాతం మందికి తమ జీవితంలో రొమాన్స్ అనేది జీవితంలో చూసి ఉండరు. (చూసినోల్లు అదృష్టవంతులు.)
ఎందుకంటే వాళ్లకు తెలియదు కాబట్టి.
వాళ్లకు తెలిసిందల్లా ఒకటే, రొమాన్స్ అంటే సెక్స్ ముందు చేసేది.
రొమాన్స్ ఉండాలంటే ముందు వాళ్ళ మధ్య ప్రేమ వ్యామోహం ఉండాలి. ప్రేమ వ్యామోహం లేకుండా ఒకరిమీద ఇంకొకరు రొమాన్స్ చేయలేరు.
శరీరాన్ని పంచుకున్నంత మాత్రాన రొమాన్స్ చేసినట్టు కాదు ప్రేమను పంచుకుంటేనే రొమాన్స్ చేసిన శరీరాలు కలవకపోయినా మనసులు కలిస్తే వాళ్ళ మధ్యన ప్రేమ ఉన్నట్టు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎవరితో ఉన్నా సరే
శారీరక సంతృప్తి కంటే మానసిక సంతృప్తి చాలా అవసరం మనిషికి అలా మానసిక సంతృప్తి లేనివాళ్లే మనోవేదనకు గురి అవుతారు.