టాక్సిక్ విడుదలకు ముహూర్తం ఖరారు
Sunday, March 23, 2025 10:00 AM Entertainment
_(3)-1742662305.jpeg)
యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ వైల్డ్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. KGF-2 తర్వాత యశ్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: