నేటి నుండి సినిమా షూటింగ్స్ బంద్
Monday, August 4, 2025 09:00 AM Entertainment
తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేసిన ఫెడరేషన్ వేతనాలు పెంచితేనే షూటింగ్స్ లో పాల్గొంటామని తేల్చి చెప్పింది.
వేతనాలు పెండింగ్ లేకుండా రోజువారీగా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇతర భాషా సినిమాలు, వెబ్ సిరిస్ లకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)