సమంత మరో కీలక నిర్ణయం
_(23)-1747583222.jpeg)
టాలీవుడ్ స్టార్ నటి సమంత తన నటనతోపాటు నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్రను వేసుకుంటున్నారు. ఆమె స్థాపించిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం శుభం. ఈ హారర్ కామెడీ జానర్ సినిమా మే 9న థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఈ సినిమా రాణించలేదు. ఇప్పుడు ఈ సినిమా OTT డీల్ విషయంలో సమంత కీలక నిర్ణయం తీసుకుంది.
శుభం సినిమా డిజిటల్ మరియు సాటిలైట్ హక్కులను ప్రముఖ మీడియా సంస్థ జీ గ్రూప్ కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత జీ గ్రూప్ తమ ఒప్పందంలో మార్పులు చేయాలని ప్రయత్నించింది. ముందుగా ఒప్పుకున్న అమౌంట్ కంటే తక్కువ చెల్లిస్తామని, ఓటీటీ డీల్ విషయంలో మెలికలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వైఖరితో విసిగిపోయిన సమంత, జీ గ్రూప్‌తో డీల్‌ను పూర్తిగా రద్దు చేస్తూ గట్టి నిర్ణయం తీసుకున్నారు. “అసలు మీకు ఈ సినిమా ఇవ్వడం లేదు” అని స్పష్టంగా చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.