ఇన్‌స్టాలో బన్నీని అన్ ఫాలో కొట్టిన రామ్ చరణ్

రామ్ చరణ్ అల్లు అర్జున్ ను ఇన్స్టాగ్రాంలో అన్ ఫాలో కొట్టారు. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మెగా-అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు కూడా వారి కుటుంబాల మధ్య దూరం పెరిగిందని చెప్పడానికి నిదర్శనంగా నిలిచాయి. ఏపీ ఎలక్షన్ల నుంచి రెండు ఫ్యామిలీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి అభిమానులు సైతం అల్లు, మెగా రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో వార్స్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పరామర్శించడంపై అనేక వార్తలు వచ్చాయి. తాజాగా రామ్ చరణ్ ఇన్‌స్టాలో బన్నీని అన్ ఫాలో చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
నిన్న మొన్నటి వరకు రామ్ చరణ్ తన ఇన్‌స్టాలో అల్లు అర్జున్‌ను ఫాలో అవుతూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి చెర్రీ తాజాగా బన్నీని అన్ ఫాలో చేశారు. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. అయితే అల్లు అర్జున్ ను చెర్రీ అన్ ఫాలో చేసినప్పటికీ తన తమ్ముడు అల్లు శిరీష్‌ని మాత్రం ఫాలో అవుతుండడం గమనార్హం. మరోవైపు చరణ్ సతీమణి ఉపాసన తన ఇన్‌స్టాలో బన్నీని ఫాలో అవుతున్నారు. అయితే చెర్రీ-బన్నీ మధ్యే ఏదో సమస్య ఉండి ఉండొచ్చనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నేరుగా నంద్యాల వెళ్లి తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ప్రకటించారు. అప్పుడే నాగ బాబు పరోక్షంగా బన్నీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేశారు. నిజానికి ఏపీ ఎలక్షన్స్‌కు ముందే అల్లు అర్జున్, రామ్ చరణ్ కు పడడంలేదంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని పుకార్లు వినిపించాయి. ఆ తర్వాత బన్నీ నంద్యాల వెళ్లడంతో ఇరుకుటుంబాల మధ్య విభేదాలు బయట పడ్డాయి.