రామ్ చరణ్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్

Tuesday, July 1, 2025 08:24 PM Entertainment
రామ్ చరణ్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్

నిర్మాత దిల్ రాజుకు రామ్ చరణ్ అభిమానులు వార్నింగ్ ఇచ్చారు. 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ గురించి ప్రతి ప్రెస్ మీట్లో, పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడటంతో ఫ్యాన్స్ చిర్రెత్తిపోయారు. 'పదే పదే దీని గురించే చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురిచేస్తున్నారు. ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ ఛేంజర్ సినిమా గురించి గాని, రామ్ చరణ్ గారి గురించి గానీ తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదురుకోవల్సి ఉంటుంది.' అంటూ ఆ ప్రకటన విడుదల చేశారు.

ప్రకటన ఇలా ఉంది...

ఇది గమనిక కాదు.చివరి హెచ్చరిక!

సినిమా అనేది ఒక బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని అందరికి తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్ లో మీరు చేసే సినిమాలు అన్ని మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయి అని చెప్పుకొనే మీరు, ఒక సినిమా నష్ట పోయేసరికి అది అందరికి అపాదించడం ఎంతవరకు సమన్యాసం.

1 నేనొక్కడినే టైంలో 14 రీల్స్ సంస్థ, హీరో గురించి ఒక్కసారి అయినా మాట్లాడారా?

2. మైత్రీ బ్యానర్లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా, ఎవరైనా హీరోల గురించి సంభాషించారా?

3. సైంధవ్ ఫెయిల్ అయ్యాక, ఆ నిర్మాత, వెంకటేశ్ గారి గురించి ఎందుకు ఒక్క నూట కూడా మాట్లాడలేదు ?

4. సంక్రాంతికి వస్తున్నాం, సినిమా హిట్ అయితే వెంకటేశ్ గారికి ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడుకున్నంతే ఇచ్చారా ? ఎక్స్ట్రా ఎమైనా ఇచ్చారా ?

5. “దర్శకుడు శంకర్ ఉన్నాడు" అని వెళ్లింది ఎవరు? "ఒక సంవత్సరం" అంటూ 3 సంవత్సరాలు వృథా చేసినది ఎవరు?

6. RRR తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చిమ్మడం కరెక్టేనా?

మా అభిమానులు 3 ఏళ్లుగా ఓ సినిమా కోసం ఎదురు చూసి, అది కూడా ఫ్లాప్ అయ్యింది అని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతిరోజూ ఇదే విషయం మీద మాట్లాడుతూ, హీరో గురించి, సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రతి ప్రెస్ మీట్ , ప్రతి ఇంటర్వ్యూలో పదే పదే దీని గురించే చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురిచేస్తున్నారు. ఇదే చివరి హెచ్చరిక, ఇంకోసారి గేమ్ ఛేంజర్ సినిమా గురించి గాని, రామ్ చరణ్ గారి గురించి గానీ తప్పుగా మాట్లాడితే, ఇక తీవ్ర పరిణామాలు ఎదురుకోవల్సి ఉంటుంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: