థగ్ లైఫ్ సినిమాపై సుప్రీం కీలక తీర్పు
Tuesday, June 17, 2025 01:08 PM Entertainment
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా `థగ్ లైఫ్' సినిమాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సినిమాను కర్ణాటకలో విడుదల చేయాల్సిందే అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కన్నడపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో థగ్ లైఫ్ ను కర్ణాటకలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మూవీ టీం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
