విజయ్ దేవరకొండపై కేఏ పాల్ ఫైర్
Wednesday, August 6, 2025 09:57 PM Entertainment
హీరో విజయ్ దేవరకొండపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ విచారణ తర్వాత విజయ్ పెద్ద యాక్షన్ చేశారన్నారు. చేసిన తప్పును ఒప్పుకోకుండా లీగల్ అని మాట్లాడుతున్నారని విమర్శించారు. విజయ్ ప్రమోట్ చేసిన యాప్స్ తెలుగు రాష్ట్రంలో బ్యాన్ అయిందని,ఈ యాప్స్ ప్రమోట్ చేసినందుకు అరెస్ట్ చేయాలని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ వేరువేరని ఆయన అంటున్నారని, అవి రెండు ఒకటేనని ప్రభుత్వానికి నిరూపించానని అన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



