బుర్జ్ ఖలీఫాపై హరిహర వీరమల్లు ట్రైలర్..!
Sunday, May 18, 2025 12:47 PM Entertainment

'హరిహర వీరమల్లు 'ప్రమోషన్లను మరింత గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా మూవీ ట్రైలర్ ను ఏకంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓ తెలుగు సినిమా ట్రైలర్ బుర్జ్ ఖలీఫాపై విడుదల చేయడం వల్ల వీరమల్లు సెన్సేషన్ వేరే లెవల్లో ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: