చచ్చిపోతా అంటూ గేమ్ ఛేంజర్ మూవీ టీమ్‌కి అభిమాని బెదిరింపులు.
తమ హీరో మీదఉన్న పిచ్చి అభిమానంతో టికెట్ రేట్లు పెరుగుతూ పోతున్న బాక్సాఫీస్ రికార్డులు ముఖ్యమంటూ జేబుకి పడుతున్న పెద్ద చిల్లులు పట్టించుకోకుండా ఆనందపడుతున్నారు వెర్రి అభిమానులు. కెరీర్‌ని, కుటుంబాన్ని, బాధ్యతలని పక్కనబెట్టి మా హీరో సినిమా రికార్డులు కొట్టాలని పూజలు చేసే ఫ్యాన్స్ పిచ్చి గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ హీరో సినిమా నుంచి అప్‌డేట్ రావడం లేదంటే తెగ ఫీలైపోయి కొన్నిసార్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు కూడా.
తాజాగా మరో పిచ్చి అభిమాని రాంచరణ్ సినిమా గేమ్ ఛేంజర్ మూవీ నుంచి అప్‌డేట్స్ రావడం లేదని, అలాఅయితే తానూ సూసైడ్ చేసుకుంటానంటూ సోషల్ మీడియాలో లెటర్ పోస్ట్ చేశాడు, గేమ్ ఛేంజర్ మూవీ, జనవరి 10 , 2025న విడుదల అవుతోంది. రూ.5 కోట్లు ఖర్చు పెట్టి డల్లాస్‌లో ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేసింది. కాకపోతే సంక్రాంతి వచ్చే సినిమాలకు పెద్దగా ప్రమోషన్ అవసరం లేదు. ఇప్పుడు ఈ లెటర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవటంతో పోలీసులు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారని సమాచారం.