మంచు విష్ణు కొత్త నిబంధన
Thursday, August 7, 2025 11:00 AM Entertainment
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మా అసోసియేషన్ సభ్యులు ఎవరైనా అవార్డుల వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వాలంటే తప్పనిసరిగా అసోసియేషన్ ఈవెంట్స్ మేనేజర్ అనుమతి తీసుకోవాలని ఆయన వెల్లడించారు.
ఈ కొత్త నిబంధన తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే మా అనుమతి లేకుండా ప్రదర్శనలు ఇచ్చే నటీనటులకు పారితోషికం లభించకపోతే, ఆ బాధ్యత 'మా' వహించదని విష్ణు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



