నటి మీరా మిథున్ ను అరెస్టు చేయండి: కోర్టు ఉత్తర్వులు
Tuesday, August 5, 2025 10:05 AM Entertainment
నటి మీరా మిథున్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు నటి మీరా మిథున్ పై వీసీకే తరఫున ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెతో పాటు ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్ పై చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
తర్వాత ఇద్దరూ బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో కేసు విచారణకు హాజరుకాని మీరా మిథున్ పై 2022లో అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



