జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను: యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్

Monday, March 10, 2025 02:40 PM Entertainment
జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను: యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్

జబర్దస్త్ ద్వారా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న రష్మి గౌతమ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో హీరోయిన్‌గా కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి వరుస షోస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. రష్మి, సుధీర ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. అందుకు కారణం వీరిద్దరు కలిసి పలు షోలు చేయడంతో పాటు బుల్లితెరపై రీల్ పెళ్లి కూడా జరిపించుకున్నారు. అలాగే జంటగా పలు ఫర్మార్మెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో వీరిద్దరు ప్రేమించుకుంటున్నారనే ప్రచారం చాలా కాలంగా ట్రెండింగ్‌లో ఉంది.

ఎన్నోసార్లు వీరు స్పందించినప్పటికీ ఇప్పటికీ సుధీర్ రష్మిలకు సంబంధించిన వార్త లెన్నో నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇదిలా ఉంటే రష్మి ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫొటోలతో పాటు జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన పెట్ మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా రష్మి తన పెట్ అస్తికలను గోదావరి నదిలో కలిపింది. తన పెట్ చుట్కీ వీడియోలను షేర్ చేస్తూ రష్మి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ''నిన్ను ప్రేమించే అవకాశం కోసం జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను. పునర్జన్మ ఉంటే నువ్వు బాధ లేకుండా పుడతావని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఫ్రీగా వెళ్ళు చుట్కీ గౌతమ్'' అనే క్యాప్షన్ జత చేసింది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: