పెళ్లి పీటలెక్కనున్న నటి అభినయ
Sunday, March 9, 2025 10:31 PM Entertainment

సినీ నటి అభినయ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. తాజాగా ఆమె నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టా వేదికగా వెల్లడించారు. కాబోయే భర్తతో గుడి గంట కొడుతున్న ఫొటోను షేర్ చేశారు. అతని ముఖాన్ని మాత్రం చూపించలేదు.
'చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్షిప్లో ఉన్నాను. మాది 15 ఏళ్ల బంధం' అని ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దివ్యాంగురాలైన (మూగ, చెవిటి) అభినయ తెలుగులో శంభో శివ శంభో, ఢమరుకం, దమ్ము, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలతో పాపులరైన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: