రాజ్ తరుణ్, లావణ్య కేసు.. బయటపడ్డ 200 నగ్న వీడియోలు

తెలుగు నటుడు రాజ్ తరుణ్, నటి లావణ్య కేసు విషయంలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు వెంటనే చర్య తీసుకొని మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుల ప్రకారం, మస్తాన్ సాయి వివిధ అమ్మాయిలతో సన్నిహితంగా ఉండగా, వారి వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేశాడని తెలిపింది. ఆ వీడియోలను ఉపయోగిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తూ, సాయి వారిని ఆందోళనకు గురిచేసేవాడని చెప్పింది. ఈ క్రమంలోనే మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను లావణ్య పోలీసులకు అందజేసింది.
మస్తాన్ సాయి గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ క్రమంలో ఏపీ పోలీసులు కూడా అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఆయనపై లావణ్య ఆరోపణలు పెరిగిన తర్వాత, మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200కు పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లావణ్యకు సంబంధించిన కొన్ని వీడియోలను అతడు రికార్డ్ చేశాడని, ఆ వీడియోలను ఉపయోగించి మస్తాన్ సాయి ఆమెను బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నం చేశాడని పోలీసులు చెబుతున్నారు.