గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లి ఇద్దరు అభిమానులు మృతి

Monday, January 6, 2025 02:09 PM Entertainment
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లి ఇద్దరు అభిమానులు మృతి

రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు ఏపి ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాబాయి అబ్బాయిలను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అయితే ఈ ఈవెంట్ రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.

తమ అభిమాన నటులను చూసేందుకు కాకినాడ నుండి వేమగిరికి బైక్ మీద వెళ్లిన తోకడ చరణ్ మరియు ఆరవ మానికంఠ ఇద్దరు బైక్ మీద తిరుగు ప్రయాణమయ్యారు. రోడ్డు ప్రమాదంలో మణికంఠ అక్కడిక్కడే మరణించగా.. చరణ్ ఆసుపత్రికి తీసుకువెళుతుండగా చనిపోయాడు. పవన్ కళ్యాణ్ మీద పిచ్చితో ఇంట్లో చెప్పిన వినకుండా బైక్ మీద వెళ్లి ప్రాణాలు తీసుకున్నారని బంధువులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

For All Tech Queries Please Click Here..!
Topics: