ఏపీలో దారుణం: మహిళను రేప్ చేసి గొంతు కోసి చంపేశారు
Monday, March 24, 2025 11:25 AM Crime

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళను రేప్ చేసి అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. కొలనుకొండ సమీపంలోని స్థానికులు గుర్తుతెలియని మహిళ హత్యకు గురైందని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వెళ్లి పరిశీలించగా మహిళను అత్యాచారం చేసి దారుణంగా మెడపై కత్తితో పొడిచి చంపేసినట్లు ఆనవాళ్లు లభించాయి. మృతదేహం వద్ద కండోమ్ ప్యాకెట్స్ కూడా దొరికాయి. ఆమె సెల్ ఫోన్ కూడా గుర్తించారు. దాని ఆధారంగా వివరాలు సేకరిస్తామని, ప్రస్తుతం ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అనేది వివరాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: