నోరా ఫతేహీలా ఉండాలని భార్యకు చిత్రహింసలు
Thursday, August 21, 2025 03:00 PM Crime
ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహీలా తన భార్య ఉండాలన్న విపరీతమైన కోరికతో ఓ భర్త ఆమెను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశాడు. అందంగా లేవంటూ, లావుగా ఉన్నావంటూ నిత్యం వేధిస్తూ, గంటల తరబడి వ్యాయామం చేయమని బలవంతం చేశాడు.
అంతటితో ఆగకుండా ఆమె గర్భం దాల్చితే బలవంతంగా అబార్షన్ చేయించి చివరకు ఇంటి నుంచి గెంటేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



