సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నమ్మలేని నిజాలు

Sunday, August 3, 2025 12:30 PM Crime
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నమ్మలేని నిజాలు

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పేదల మహిళల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని ట్రాప్ చేసినట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది. శిశువులను కొనుగోలు చేయడానికి వారికి రూ.90,000 చెల్లించి, దానిని సరోగసీ ద్వారా జన్మించిన శిశువుగా చెప్పి, సంతానం లేని దంపతుల నుంచి రూ.35 లక్షల వరకు వసూలు చేశారని దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మంది నిందితులు అరెస్టయ్యారు.

ఏపీ, తెలంగాణలో ఏజెంట్లు కళ్యాణి, సంతోషి కీలకంగా వ్యవహరించారని, గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపులతో డబ్బు ఆశ చూపించి పిల్లలను కొనుగోలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. వైజాగ్, విజయవాడ కేంద్రంగా డెలివరీలు చేసి పిల్లలను తీసుకువచ్చేవారిని పోలీసులు తెలిపారు. ఇలా అక్రమ సంపాదనతో ఏపీ,తెలంగాణలో భవనాల కొనుగోలు చేసినట్లుగా తెలిపారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: