నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
Sunday, May 18, 2025 09:41 PM Crime
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని దేవరాజుపుర గ్రామములో విషాదం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఈ మేరకు మృతులను గౌతమి, అశ్విని, శాలినిగా గుర్తించారు. ఈ ముగ్గురి మరణంతో కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



