ఓయోలో 24 ఏళ్ల టీచర్, 14 ఏళ్ల విద్యార్థిని.. షాకింగ్ ఘటన..

Wednesday, May 7, 2025 01:14 PM Crime
ఓయోలో 24 ఏళ్ల టీచర్, 14 ఏళ్ల విద్యార్థిని.. షాకింగ్ ఘటన..

అలీగఢ్‌లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 24 ఏళ్ల టీచర్, తన 14 ఏళ్ల విద్యార్థిని ఇద్దరూ ఓయో రూమ్‌లో మృతదేహాలుగా కనిపించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. జ్వాలాజీపురం ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల వ్యక్తి ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలకు చెందిన 14 ఏళ్ల విద్యార్థిని, అతని వద్దకు ట్యూషన్ కోసం వెళ్లేది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య బంధం బలపడింది. తరచూ బయట కలవడం ప్రారంభించారు. దీంతో ఈ విషయం విద్యార్థిని ఇంట్లో తెలియడంతో గొడవ జరిగింది. విద్యార్థిని ట్యూషన్ మానిపించారు. స్కూల్‌లో కలవకుండా చర్యలు తీసుకున్నారు. 

అయినప్పటికీ వారు రహస్యంగా కలుస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సోమవారం వీరిద్దరు ఓయో రూమ్‌లో విగత జీవులుగా కనిపించారు. మే 5న సాయంత్రం 6 గంటల సమయంలో 112 ఎమర్జెన్సీ నంబర్‌కు ఓ కాల్ వచ్చింది. ఖేరేశ్వర్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు సమీపంలోని ఓ ఓయో హోటల్ రూమ్ నెంబర్ 204లో యువతి, యువకుడు మృతదేహాలుగా కనిపించారని సమాచారం అందింది. విద్యార్థిని ఆ రోజున స్కూల్‌కు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు భావించారు. కానీ టీచర్ ఆమెను హోటల్‌కు తీసుకెళ్లాడు. ఉదయం 8:40 గంటల సమయంలో వారు హోటల్ రూమ్‌లోకి వెళ్లినట్టు సీసీ టీవీలో రికార్డు అయినట్లు గుర్తించారు. హోటల్ గదిలో విషం ఉన్న ఖాళీ బాటిల్‌ను గుర్తించారు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సమాచారం తెలిసిన వెంటనే ఇరువైపు కుటుంబ సభ్యులు హోటల్‌కు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్ బాలికపై టీచర్ ప్రేమ సంబంధం, ఆపై జరిగిన ఆత్మహత్య వ్యవహారంపై లోతుగా విచారించనున్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: