వివేకా హత్య కేసు: ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై అనుమానాలు
Thursday, March 6, 2025 10:31 PM Crime

వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగన్న మరణం అనుమానాస్పద మృతిగా ఉందని కడప ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు సాక్షులు శ్రీనివాసులరెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, రంగన్న చనిపోయారని చెప్పారు.
నిన్న రంగన్న చనిపోవడంపై ఆయన భార్య ఫిర్యాదు చేయగా, అనుమానాస్పద మృతి కింద విచారణ చేస్తున్నామన్నారు. గతంలో సాక్షులు చనిపోయినప్పుడు పోలీసులు, సీబీఐని నిందించారని చెప్పారు. వీరి మృతిపై అనుమానాలు ఉన్నాయని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు వివరించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: