యూట్యూబ్ చూసి టాయిలెట్ లో ప్రసవించిన విద్యార్థిని

Monday, February 3, 2025 10:05 AM Crime
యూట్యూబ్ చూసి టాయిలెట్ లో ప్రసవించిన విద్యార్థిని

యూట్యూబ్‌లో చూసి టాయిలెట్ లో విద్యార్థిని ప్రసవించి శిశువు చెత్త కుప్పలో పడేసి దారుణ ఘటన తమిళనాడులోని తంజావూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కుంభకోణంలోని ఓ కాలేజీలో ఓ విద్యార్థిని(20) గర్భం దాల్చింది. శుక్రవారం క్లాస్ వింటుండగానే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో టాయిలెట్‌కు వెళ్లిన ఆమె అక్కడే శిశువుకు జన్మనిచ్చినట్లు సమాచారం. ఇక ఏం చేయాలో తెలియని ఆ విద్యార్థిని యూట్యూబ్‌లో చూసి శిశువు బొడ్డు కోసింది. అనంతరం చెత్తకుప్పలో శిశువును పడేసి పైన చెత్త కప్పేసింది. 

తర్వాత ఏమీ తెలియనట్లు తరగతి గదిలోకి వెళ్లి కూర్చుంది. ఆమె నుంచి రక్తస్రావం అవుతుండటాన్ని గుర్తించిన తోటి విద్యార్థినిలు విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లడంతో వారు 108 అంబులెన్స్‌ను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె ప్రసవించినట్టు గుర్తించి బిడ్డ గురించి ఆరా తీశారు. అంబులెన్స్‌ను పంపి కళాశాల చెత్తకుప్పలో పడివున్న శిశువును ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంటనే చికిత్స అందించడంతో శిశువు బతికింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: