ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Monday, July 21, 2025 09:30 PM Crime
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శావల్యాపురం మండలం కలమర్లపూడి వద్ద ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. కారుమంచి నుండి వినుకొండకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



