మమ్మల్ని ఒకే సెల్ లో ఉంచండి: మీరట్ మర్చంట్ అధికారి హత్య కేసు నిందితులు
Monday, March 24, 2025 02:49 PM Crime

మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తను చంపాక ప్రియుడితో జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్ అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. అయితే ఈ కేసులో వీరద్దర్నీ అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు.
చౌదరి చరణ్ సింగ్ జైల్ లో ఉన్న వీరిని పోలీసులు విచారిస్తున్నారు. భర్తను హత్య చేసి జైలు పాలయ్యానన్న కనీస పశ్చాత్తాపం కూడా ముస్కాన్ లో కనిపించడం లేదు. జైల్లో కూడా తామిద్దరం కలిసే ఉంటామని పట్టుబట్టారు. ఇద్దర్నీ వేరు వేరు సెల్ లో వేయకండి తాము ఇద్దరం ఒకే చోట ఉంటామంటూ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇది జైలు నియమాలకు విరుద్ధమని, ఇలా ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి ఉండటం సాధ్యం కాదని సదరు అధికారులు స్పష్టం చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: