గుడి పక్కన వ్యభిచారం.. సీన్ కట్ చేస్తే.!
Tuesday, July 22, 2025 12:31 PM Crime
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని చెర్లోపల్లిలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ మేరకు ఒక ఇంటిని అద్దెకు తీసుకుని దాదాపు రెండేళ్లుగా రహస్యంగా వ్యభిచారం చేయిస్తున్న విజయ అనే మహిళను అరెస్టు చేశారు. గ్రామస్తులకు తెలిసినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో గుడి పక్కనే సాఫీగానే నడుస్తూ వచ్చింది. గంగాధర నెల్లూరు సీఐ వాసంతికి సమాచారం రావడం అందడంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టింది.
ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నిర్వాహకురాలు విజయతో పాటు ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. తిరుపతి, కుప్పం, తమిళనాడుకు చెందిన యువతులుగా గుర్తించారు. దాడి సమయంలో పరారైన వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ వాసంతి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)