వీడో వెరైటీ దొంగ..!
Monday, July 28, 2025 02:06 PM Crime
నెల్లూరు జిల్లాలో ఓ వెరైటీ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరుకు చెందిన రమేశ్ (50)ను దొంగతనం కేసులో ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు పగటిపూట ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లో దొంగతనాలు చేస్తూ రాత్రికి కందుకూరులోని ఇంటికి చేరుకుంటున్నట్లు తేలిందని వారు తెలిపారు.
ఒంటరిగా బస్సులో ప్రయాణిస్తూ బ్యాగ్ ను అందులోనే ఉంచి టిఫిన్ కోసమో, భోజనం కోసమో బస్సు దిగేవారే అతని టార్గెట్ అని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు వివరించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



