యజమాని మర్మాంగాలను కొరుక్కుతిని చంపేసిన పెంపుడు కుక్క

పెంపుడు కుక్క యజమాని మర్మాంగాలను కొరుక్కుతిని చంపేసిన ఘటన హైదరాబాద్ మధురానగర్‌లో చోటు చేసుకుంది. పవన్ కుమార్(37) ఓ అపార్ట్‌మెంట్‌లో తన పెంపుడు కుక్కతో కలిసి పడుకున్నాడు. ఉదయం అతని స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా పవన్ కుమార్ డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో చుట్టుపక్కల వారితో కలిసి డోర్ పగలగొట్టి చూడగా పవన్ కుమార్ రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. పెంపుడు కుక్క పవన్ కుమార్ మర్మాంగాలను కొరుక్కుతిని నోటి నిండా రక్తంతో కనిపించింది.
అయితే పెంపుడు కక్క ఆ పని చేసిందా లేకపోతే ఎవరైనా ఆ పని చేసి.. ప్లాన్డ్ గా కుక్క మీద తోసేందుకు ఆలా చేశారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. సాధారణంగా ఇంట్లో పెంచుకునే కుక్కలకు పళ్లల్లో పదును తగ్గించేస్తారు. అలా కరిచేలా ఉంటే ఇంట్లో ఉంచుకోరు. ఇంత దారుణంగా సరిగ్గా తెలిసినట్లుగా మర్మాంగాలపైనే పెంపుడు శునకం దాడి చేస్తుందా.. అన్న దానిపై పరిశీలనలు చేయాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.