Breaking: సాక్షి కార్యాలయానికి నిప్పు

Tuesday, June 10, 2025 08:26 PM Crime
Breaking: సాక్షి కార్యాలయానికి నిప్పు

ఏలూరులోని సాక్షి కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. దీంతో ఆఫీసులోని ఫర్నిచర్, సోఫా సెట్లు కాలిపోయాయి. ఆఫీసు ముందు ఉన్న కారును కూడా ధ్వంసం చేశారు. ఇది టీడీపీ నేతల పనే అని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, ర్యాలీగా వెళ్తుంటే తమపై నిందలు మోపుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఇటీవల సాక్షి టీవీ టీవీ డిబేట్లో అమరావతి మహిళలపై జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ కేసులో సాక్షి టీవీ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: