తల్లితో వివాహేతర సంబంధం.. కూతురిపై లైంగిక దాడి
Tuesday, June 3, 2025 10:22 PM Crime
తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మేదరమట్లలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ, భర్త మరణం తర్వాత కూలి పనులు చేస్తూ చిన్న కుమార్తెతో జీవిస్తోంది.
ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె కూతురుపై కన్నేశాడు. మంగళవారం ప్రియుడి కోరిక తీర్చేందుకు ఆమె తన కుమార్తెను అతని వద్దకు పంపింది. బాలిక ఒప్పుకోకపోవడంతో కాళ్లను తాళ్ళతో కట్టి, నిస్సహాయ స్థితిలో ఆమెపై తల్లి ప్రియుడు లైంగిక దాడి చేశాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
