లావణ్య నా జీవితం నాశనం చేసింది.. ప్రీతి సంచలన ఆరోపణలు

సుమారుగా 7 నెలల క్రితం హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ కేసు పెట్టిన లావణ్య కేసులో రోజుకొక కొత్తకోణం బయట పడుతోంది. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్యగా మొదలైన ఈ స్టోరీలో రకరకాల పాత్రలు, ఎవరు ఊహించని విషయాలు బయటకి వచ్చాయి. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ ఆరోపణలు చేసిన లావణ్య ఇప్పుడు మస్తాన్ సాయి వద్ద దాదాపు 300 అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందించింది. ఈ హార్డ్ డిస్క్ కైవసం చేసుకున్న పోలీసులు అటు మస్తాన్ సాయిని కూడా అరెస్టు చేశారు.
ఇప్పుడు మరో వ్యక్తి బయటకి వచ్చారు. లావణ్య తన జీవితం నాశనం చేసిందంటూ ఆమె ఫ్రెండ్ ప్రీతి సంచలన కామెంట్లు చేశారు. "లావణ్య నాకు డ్రగ్స్ అలవాటు చేసింది. నాకు మాత్రమే కాదు నాతో పాటు చాలామందికి ఆమె డ్రగ్స్ అలవాటు చేసింది. లావణ్య కన్నుపడితే ఎంతటి వారైనా సరే పడాల్సిందే. చాలామంది ఫోన్లు లాక్కొని, వారిని ఎప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది. అలాగే మస్తాన్ సాయి ఫోన్లో ఉన్న వీడియోలను తన ఫోన్ లోకి ఎక్కించుకొని గత రెండేళ్లుగా మస్తాన్ సాయిని ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోంది” అని ప్రీతి తెలిపింది. ఇక ప్రస్తుతం ప్రీతీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు అంటూ లావణ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు.