భార్య ఫోనుకు కిస్ ఎమోజీ.. ఇద్దరిని నరికి చంపిన భర్త

భార్య ఫోన్ కు కిస్ ఏమోజీ రావడంతో ఆగ్రహంతో భర్త ఇద్దరిని నరికి చంపాడు. ఈ భయంకర ఘటన కేరళలోని పతనం తిట్ట కలంజూరులో చోటుచేసుకుంది. పతనంతిట్టలోని కలంజూరుకు చెందిన బైజు (35), వైష్ణవి (28)కి కొంతకాలం క్రితం పెళ్లి అయింది. వారికి 10, 5 సంవత్సరాల ఇద్దరు కొడుకులున్నారు. అదే కాలనీలో తన తల్లితో కలిసి ఉంటున్న వైష్ణవి స్నేహితుడు విష్ణు (30) అప్పుడప్పుడు వీరి ఇంటికి వస్తుంటాడు.
వైష్ణవితో వాట్సప్ చాటింగ్ కూడా చేస్తుంటాడు. బైజు కొంతకాలంగా దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల విష్ణు ఓ సారి వైష్ణవి వాట్సాప్కు కిస్ ఎమోజీ పంపించాడు. అది అనుకోకుండా బైజు కంటపడింది. దీంతో వైష్ణవిని నిలదీయగా ఇద్దరమధ్య వివాదం మొదలైంది.
ఈ గొడవలోనే వైష్ణవి ఫ్రెండ్ విష్ణు ఇంటికి వెళ్లింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన బైజు కొడవలి పట్టుకుని విష్ణు ఇంటికి వెళ్లాడు. భార్యను బయటకు రమ్మని కేకలు వేసిన ఆమె రాలేదు. విష్ణు ఇంట్లోకి బలవంతంగా చొరబడి వైష్ణవిని బయటకు లాకెళ్లి కొడవలితో చాలా చోట్ల నరికాడు. బైజును ఆపడానికి వెళ్లిన విష్ణును కూడా అదే కొడవలితో వేటు వేశాడు. విష్ణు, వైష్ణవి తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. అయితే వారిద్దరిని నరికిన తర్వాత రక్తపు మరకలు కనిపించకుండా బైజు స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. ఆ తర్వాత మరో స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పేశాడు. వెంటనే అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బైజును అరెస్ట్ చేశారు.