శృంగారానికి నిరాకరించిన భార్య.. భర్త ఏం చేశాడంటే..

తన కామవాంఛ తీర్చలేదని తాళికట్టిన భార్యను భర్త అతి కిరాతకంగా కత్తితో నరికి చంపిన దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం సంత సీతారాంపురం గ్రామంలో చోటు చేసుకుంది.
సంత సీతారాంపురం గ్రామానికి చెందిన గాలి అప్పలరెడ్డి, నాగమ్మ ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె నాలుగేళ్ల కిందటే వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోగా కుమారుడు విశాఖలో తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం ఎప్పటిలాగే అప్పల రెడ్డి, నాగమ్మ భార్యాభర్తలు ఇద్దరూ కూలీ పనికి వెళ్లి రాత్రికి ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనం చేసి నిద్రించే సమయంలో భర్త తన కామవాంఛ తీర్చాలని భార్య నాగమ్మను బెడ్‌రూమ్‌లోకి రమ్మన్నాడు.
అయితే పగలంతా కూలీ పని చేసి వచ్చిన భార్య అలసటగా ఉండటంతో భర్తతో కలిసేందుకు ఆసక్తి చూపలేదు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న భర్త అప్పల రెడ్డి ఆగ్రహానికి గురయ్యాడు. భర్త కోరిక తీర్చమంటే కాదంటావా..ఎవరితో అయినా కులుకుతున్నావా అంటూ క్షణికావేశంలో ఇంట్లో ఉన్న కత్తితో నిద్రిస్తున్న భార్యపై దాడి చేసి చంపేశాడు. విచక్షణారహితంగా నరకడంతో నాగమ్మకు మెడపైన, నుదురుపైన మొత్తంగా శరీరంపై 12చోట్ల కత్తి పోటు గాయాలయ్యాయి. నాగమ్మ పడుకుని ఉన్న చోటే రక్తం మడుగులో కుప్పకూలిపోయింది. భర్త పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలికి క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడు అప్పల రెడ్డి ఆచూకీ కోసం ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళం DSP విద్యా సాగర్ తెలిపారు. నాగమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం జిజిహెచ్ కు తరలించారు.