ఉగాది రోజు విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
Sunday, March 30, 2025 03:27 PM Crime
ఉగాది రోజే శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని గాంధీ బజార్‌లోని ఓ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఇంట్లో నలుగురు విగత జీవులుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మృతులను కృష్ణాచారి, ఆయన భార్య సరళమ్మ, పిల్లలు సంతోష్, భువనేశ్‌గా గుర్తించారు. సంతోష్ పదోవ తరగతి చదువుతుండగా, భువనేష్ ఆరో తరగతి చదువుతున్నాడు. వీరంతా విషం తాగి మృతి చెందినట్టు తెలుస్తుంది. కృష్ణాచారి బంగారం వ్యాపారం చేసేవారు. ఆర్థిక సమస్యలతో కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



